హైదరాబాద్ పై స్పైస్ జెట్ దృష్టి

- December 06, 2018 , by Maagulf
హైదరాబాద్ పై స్పైస్ జెట్ దృష్టి

హైదరాబాద్ : హైదరాబాద్ బిజినెస్ మీద దృష్టి కేంద్రీకరించింది స్పైస్ జెట్ విమానయాన సంస్థ. 2019 జనవరి ఒకటి నుంచి 8 కొత్త సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. పుణె, కోల్‌కతా, కోయంబత్తూర్‌ లకు డైరెక్ట్ సర్వీసులు నిర్వహించనుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు 33 ప్రాంతాలకు విమాన సర్వీసులను నేరుగా అందిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త సర్వీసులతో కలుపుకొని 41 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ కేంద్రంగా స్పైస్ జెట్ ప్రకటించిన ప్రారంభ ఆఫర్లు ఇవే :

1. హైదరాబాద్‌ - కోల్‌కతా మార్గం : 2,699/-

2. కోల్‌కతా - హైదరాబాద్‌ మార్గం : 3,199/-

3. హైదరాబాద్‌ - పుణె : 2,429/-

4. పుణె - హైదరాబాద్‌ : 2,209/-

5. హైదరాబాద్‌ - కోయంబత్తూర్‌ : 2,809/-

6. కోయంబత్తూర్‌ - హైదరాబాద్‌ : 2,309/- 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com