చంపేస్తానని బెదిరింపు: ఆత్మహత్యాయత్నం చేసిన మెయిడ్‌

- December 06, 2018 , by Maagulf
చంపేస్తానని బెదిరింపు: ఆత్మహత్యాయత్నం చేసిన మెయిడ్‌

దుబాయ్‌లో ఓ మెయిడ్‌ తన పాస్‌పోర్ట్‌ని ఇవ్వనందుకుగాను స్పాన్సరర్‌ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించింది, చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసియాకి చెందిన మెయిడ్‌, ఆసియాకే చెందిన ఓ వ్యాపారవేత్త దగ్గర మెయిడ్‌గా పనిచేస్తోంది. తొలుత స్పాన్సరర్‌నీ, ఆయన కుటుంబ సభ్యుల్నీ బెదిరించిన మెయిడ్‌, చివరికి తన మీద తానే దాడి చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. మెయిడ్‌, ఐదేళ్ళ బాలుడ్ని కూడా బెదిరించింది. అయితే ఐదేళ్ళ బాలుడ్ని బెదిరించే క్రమంలో చిన్నారి తల్లి అడ్డుకపడటంతో మెయిడ్‌కి గాయాలయినట్లు తెలుస్తోంది. చిన్నారి తల్లికి కూడా గాయాలయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com