షూటింగ్‌లో గాయపడ్డ లేడీ సూపర్ స్టార్
- December 06, 2018
మాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ మంజూ వారియర్ ప్రస్తుతం సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కాలిదాస్ జయరామ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్షన్ సీన్స్ తెరకెక్కింస్తుండగా మంజూ వారియర్ గాయపడింది. దీంతో వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం. అయితే తలకి బలమైన గాయం కావడంతో కుట్లు కూడా వేశారట. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ అమ్మడు కిట్టిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండగా, భారీ చిత్రం ఓడియన్ డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరో చిత్రం లూసిఫర్‌లోను మంజూ వారియర్ , మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







