ఎన్నికల కోసం భారీ భద్రత..రంగంలోకి లక్ష మంది బలగాలు
- December 06, 2018
ఎన్నికల కోసం పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తుకు రాష్ట్ర పోలీస్ సిబ్బందితోపాటు 6 రాష్ట్రాలు, పలు కేంద్ర బలగాల నుంచి భారీగా సిబ్బందిని రంగంలోకి దించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతం చేస్తూనే అక్కడి ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఎన్నికల కోసం 414 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 404 స్పెషల్ స్క్వాడ్స్, 3 వేల 385 సంచార బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4 వేల సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలున్నాయి. భద్రత కోసం 276 కేంద్ర బలగాలు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, కర్నాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 20వేలమందిని రంగంలోకి దించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 11 వేల 853 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశారు పోలీసులు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటి వరకు వేయి 314 కేసులు నమోదయ్యాయి. తనిఖీల సందర్భంగా 17 వేల 841 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా… 90 వేల 128 మందిని బైండోవర్ చేశారు. 8 వేల 481 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకోగా.. 11 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను జిల్లాలకు ఇన్చార్జి అధికారులుగా నియమించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







