పెట్టా : నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫస్ట్ లుక్
- December 06, 2018
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన సీనియర్ హీరోయిన్స్ త్రిష, సిమ్రాన్ లు నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో రజనీ, విజయ్ ఫస్ట్ లుక్ లు బయటికొచ్చాయి. తాజాగా, ఈ సినిమా నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫస్ట్ లుక్ వచ్చేసింది.
ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సిద్దఖీ కాస్త వయసు పైబడిన మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన నటించిన తొలి తమిళ చిత్రమిది. ఇక, ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రజనీ నటించిన కబాలా, కాలా సినిమాలు తీవ్రంగా నిరాశపరిచినా.. 2.ఓ మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2.ఓ తర్వాత రజనీ నటించిన పెట్టా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే ధీమాతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







