రూపాయి మళ్లీ..
- December 06, 2018
ముందురోజు స్వల్పంగా కోలుకున్న రూపాయి తిరిగి బలహీనపడింది. బుధవారం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తొలుత 70.75 వరకూ జారినప్పటికీ చివర్లో కోలుకుంది. 3 పైసల స్వల్ప లాభంతో 70.46 వద్ద ముగిసింది. అయితే అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాద భయాలు, రిజర్వ్ బ్యాంక్ యథాతథ పాలసీ నేపథ్యంలో మరోసారి నీరసించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 38 పైసలు(0.55 శాతం) క్షీణించి 70.84 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 44 పైసలు(0.62 శాతం) నీరసించి 70.90 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, దేశీ స్టాక్స్‌లో ఇటీవల తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
ఆరంభంలోనే నష్టాలు
రూపాయి నాలుగు రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్‌పడిన సంగతి తెలిసిందే. వారం ప్రారంభంలో రూపాయి 88 పైసలు(1.25 శాతం) పతనమై 70.46 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 70 మార్క్ ఎగువకు తిరోగమించింది. ఈ బాటలో మంగళవారం సైతం 3 పైసలు క్షీణించి 70.49 వద్ద ముగిసింది. అయితే బుధవారం నామమాత్రంగా బలపడింది. కాగా..నేడు రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. దీంతో రూ. 10,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేయనుంది. దీంతో మిడ్‌సెషన్ నుంచీ రూపాయి కొంతమేర బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







