కియా కార్లు.. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్లు..
- December 06, 2018
ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణాపై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వాటిని స్వయంగా పరిశీలించిన చంద్రబాబు.. కియా మోటర్స్ ఎండీతో కలిసి కాసేపు కార్లో ప్రయాణించారు.
కియా ఎలక్ట్రిక్ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం విజయవాడతో పాటు పలు నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.ఏపీలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కియా మోటార్స్ సహాయపడనుంది. ఒప్పందంలో భాగంగా కియా మోటార్స్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి 3 ఎలక్ట్రిక్ కార్లను బహుమతిగా ఇవ్వనుంది.
ఇప్పటికే కియా సంస్థ తన కార్ల ఫ్లాంట్‌ను అనంతరం పురం జిల్లాలో నెలకొల్పింది. ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కియా మోటార్స్. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







