బ్రెజిల్ బ్యాంక్ రాబరీ: 14 మంది కాల్చివేత...
- December 08, 2018
బ్రెజిల్:బ్రెజిల్ దేశం నార్త్ ఈస్ట్ ప్రాంతం సీరా రాష్ట్రంలోని మిలాగ్రిస్ పట్టణం. మెయిన్ రోడ్డులో వరసగా రెండు బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు కూడా ఉన్నాయి. లావాదేవీలు భారీగా జరుగుతుంటాయి. రద్దీగా ఉంటుంది. ఈ రెండు బ్యాంకులు పక్కపక్కనే ఉండటం, భారీగా డబ్బు ఉంటుందని భావించిన ఓ గ్యాంగ్ దోపిడీకి స్కెచ్ వేసింది. అనుకున్నదే ప్లాన్ అమలు చేసింది గ్యాంగ్. మొత్తం ఐదుగురు. ముసుగులు వేసుకున్నారు.. గన్స్, ఇతర కట్టర్లు రెడీ చేసుకుని పెద్ద వ్యాన్ లో బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందర్నీ నిర్బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
ఓపెన్ ఫైరింగ్ :
బ్యాంకు దోపిడీదారులపై పోలీసులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. లోపల ఎంత మంది ఉన్నారు.. ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా తుపాకుల మోత మోగించటంతో 14 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు దోపిడీదారులు.
మిగిలిన 9 మంది బ్యాంకుకి వచ్చిన కస్టమర్లు, సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉండటం విషాదం. కాల్పుల కాల్పులపై బ్రెజిల్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముందూ వెనకా చూడకుండా కాల్పులకు దిగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.బ్రెజిల్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







