షార్జా ఎయిర్‌పోర్ట్: కొత్త బ్యాగేజ్ రూల్స్ అమలు
- December 08, 2018
షార్జా ఎయిర్‌పోర్ట్ అథారిటీ (ఎస్‌ఎఎ), కొత్త బ్యాగేజీ రూల్స్‌ని షార్జా ఎయిర్ పోర్ట్‌లో డిసెంబర్ 4 నుంచి అమలు చేస్తోంది. ఆపరేషనల్ పెర్ఫామెన్స్‌ని పెంచడం, ఇంప్రోపర్ బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ని తగ్గించడం వంటి అంశాల నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చారు. షార్జా ఎయిర్ పోర్ట్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వివిధ ఆపరేటర్స్‌కి ఇప్పటికే ఈ విషయమై ఎస్‌ఎఎ సమాచారం అందించింది. కొత్త పాలసీకి అనుగుణంగా లేని బ్యాగేజీని ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించడంలేదు. కొత్త బ్యాగేజీ పాలసీ ప్రకారం, బ్యాగేజీలు 75 సెంటీమీటర్ల ఎత్తు, 60 సెంటీమీటర్ల వెషడల్పు, 90 సెంటీ మీటర్ల పొడవు వుండాలి. దీనికి విరుద్ధంగా వుండే బ్యాగేజీలను ఓవర్‌సైజ్డ్ బ్యాగేజీగా గుర్తిస్తారు. షార్జా ఎయిర్ పోర్ట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్యాగేజీని ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ఎస్‌ఎఎ, 200కి పైగా ఎయిర్ పోర్ట్స్‌కి సేవలు అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 500 ఎయిర్‌లైన్స్‌కి ఈ ఎయిర్‌పోర్ట్ సేవలందిస్తున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







