96 రీమేక్..విజయ్ లాగా ఆ హీరో ఆకట్టుకోగలడా!

- December 09, 2018 , by Maagulf
96 రీమేక్..విజయ్ లాగా ఆ హీరో ఆకట్టుకోగలడా!

కోలీవుడ్ లో ఈమధ్య రిలీజై సూపర్ సక్సెస్ అయిన సినిమా 96. విజయ్ సేతుపతి హీరోగా త్రిష ఫీమేల్ లీడ్ గా వచ్చిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ ను మెప్పించింది. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ అవడంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

అల్లు అర్జున్, నానిలకు స్పెషల్ షో వేసి 96 సినిమా చూపించిన దిల్ రాజు ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమా ఒప్పుకుంటారని అనుకున్నాడు కాని అల్లు అర్జున్ తన ఇమేజ్ కు ఇది సూట్ అవదని వద్దనగా.. నాని తనకు ఈ సబ్జెక్ట్ రొటీన్ అవుతుందని కాదన్నాడట. అందుకే ఇప్పుడు ఆ రీమేక్ కు హీరోని వెతికే పనిలో ఉన్నాడు దిల్ రాజు.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం మాన్లీ స్టార్, మాస్ హీరో గోపిచంద్ ను 96 రీమేక్ లో నటింపచేయాలని అనుకుంటున్నాడట దిల్ రాజు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని గోపిచంద్ ఈ రీమేక్ తో ప్రేక్షకుల మనసు గెలవాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే గోపిచంద్ కు ఈ సినిమా ఫ్రెష్ ఇమేజ్ తెచ్చే అవకాశం ఉంది. 

తొలివలపు హీరోగా చేసి ఆ తర్వాత విలన్ గా టర్న్ అయ్యి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన గోపిచంద్ ప్రస్తుతం కథా చర్చలు నడిపిస్తున్నాడు. తెలుగులో కూడా 96 రీమేక్ కు త్రిషనే హీరోయిన్ గా తీసుకుంటున్నారట. గోపిచంద్, త్రిష కలిసి శంఖం సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఈ మూవీతో మళ్లీ జతకడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com