తండ్రి హత్య.. తనయుడి అరెస్ట్‌

- December 10, 2018 , by Maagulf
తండ్రి హత్య.. తనయుడి అరెస్ట్‌

మస్కట్‌: ఓ వ్యక్తి తన కుమారుడి చేతిలోనే హత్యకు గురైన ఘటన ఇది. ఆర్థిక సంబంధమైన గొడవలే ఈ హత్యకు కారణమని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించడం జరిగింది. ఓ కుమారుడు తన తండ్రి తలపై వెనుక భాగంలో బలమైన వస్తువుతో కొట్టి చంపేశాడని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ ముట్రాలో వాడి కబీర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు వివరించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలో తగాదాలు, ఆర్థిక పరమైన గొడవలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com