ఘనంగా ఫార్మర్స్‌ మార్కెట్‌ ప్రారంభం

- December 10, 2018 , by Maagulf
ఘనంగా ఫార్మర్స్‌ మార్కెట్‌ ప్రారంభం

బహ్రెయిన్‌ ఫార్మర్స్‌ మార్కెట్‌ ఘనంగా ప్రారంభమయ్యింది. వేలాది మంది, ఈ అగ్రికల్చరల్‌ ఫెస్టివల్‌ తొలి రోజున పాల్గొన్నారు. స్థానిక వ్యాపారులు తమ తాజా ఉత్పత్తుల్ని ప్రదర్శన మరియు అమ్మకం కోసం దీన్నొక వేదికగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏడవ ఈవెంట్‌ అనీ, ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్‌తో పోల్చితే, ఈ ఈవెంట్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. బుడైయా బొటానికల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌ ఐదు నెలలపాటు జరుగుతుంది. 40 మందికి పైగా ఫార్మర్స్‌ ఈ ఫెస్టివల్‌లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతున్నారు. అగ్రికల్చర్‌ ప్రోడక్ట్స్‌తోపాటు, సంప్రదాయ కళలు, రెస్టారెంట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాక్టివిటీస్‌ ఈ ఫెస్టివల్‌లో అదనపు ఆకర్షణలు. నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ ఈ ఫెస్టివల్‌ని మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ సహకారంతో నిర్వహిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com