పుట్టినరోజు వేడుకలకు తలైవా దూరం
- December 12, 2018
చెన్నై:ఈ ఏడాది సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. బుధవారం ఆయన జన్మదినం కావడంతో అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం సభ్యులు వేడుకలకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. నిరాశపరిచి ఉంటే క్షమించాలని కోరారు. అందులో భాగంగానే వేడుకలకు దూరమైనట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ముంబై బయలుదేరి వెళ్లారు. వారం చివరికి తిరిగి వస్తారని తెలిసింది. గతేడాది చివరి రోజున రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన రజనీకాంత్ ఆ తర్వాత రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు చేశారు. ఇంతవరకు పార్టీకి సంబంధించిన జెండా, అజెండా, ప్రారంభం తదితర విషయాలను ప్రస్తావించలేదు.
మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఈ పుట్టిన రోజుకు రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటన ఏదైనా చేస్తారేమోనని ఎదురు చూసిన అభిమానులకు కొంత నిరాశే ఎదురైంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







