డాక్టర్ల బృందానికి బ్రెజిల్‌ ప్రజల వీడ్కోలు

- December 12, 2018 , by Maagulf
డాక్టర్ల బృందానికి బ్రెజిల్‌ ప్రజల వీడ్కోలు

బ్రసీలియా : దాదాపు 200మంది క్యూబా డాక్టర్లు బ్రెజిల్‌ వీడి వెళుతుంటే బ్రెజిల్‌ ప్రజలు వారికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు ఇచ్చారు. 'థాంక్యూ క్యూబా' అంటూ రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించారు. బ్రసీలియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. క్యూబా డాక్టర్ల మానవత్వం, వారి వైద్య నైపుణ్యాలు కలకాలం తాము గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. బ్రెజిల్‌లో ఎలాంటి వసతులు లేని చోట కూడా అద్భుతమైన సేవలందించారని పేర్కొంటూ వారి సేవలను కొనియాడారు. 'ఇదొక దుర్దినం, 6లక్షల మందికి పైగా బ్రెజిలియన్లు డాక్టర్లు లేకుండా వుండాల్సిన పరిస్థితి వస్తోంది. గత ఐదేళ్ళుగా అత్యాధునికమైన వైద్య సేవలను అందించిన క్యూబన్లకు ఇప్పుడు వీడ్కోలు పలకాల్సి వస్తోంది.' అని ప్రొఫెసర్‌ రొనాల్డొ ఫెరీరా వ్యాఖ్యానించారు. ఇలా డాక్టర్లు వెళ్ళిపోవడం వల్ల ముందుగా ప్రభావితమయ్యేది మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలని అన్నారు. ఇన్నాళ్ళుగా తమతో వున్న క్యూబన్‌ డాక్టర్ల సేవలకు గుర్తింపుగా, వారి పట్ల గౌరవం, కృతజ్ఞతతో తాము వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. బ్రెజిల్‌లో మాస్‌ మెడికోస్‌ కార్యక్రమం చాలా కీలకమైన ప్రాజెక్టు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com