అబుధాబి:'ఇడియట్' అన్నందుకు భారీ జరిమానా!
- December 12, 2018
అబుధాబి:అబుధాబిలో చట్టాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సరదాగా ఒక మాట అన్న అది అక్కడ తప్పు అయిపోతుంది. ఇప్పుడు ఓ వ్యక్తికి అదే పరిస్థితి ఎదురైంది. తనకు కాబోయే భార్యను సరదాగా 'ఇడియట్' అన్నందుకు గాను అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వాట్సాప్‌లో ఇడియట్ అని సరదాగా సందేశం పంపించాడు. దీంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. విచారించిన న్యాయస్థానం అతడికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
60 రోజుల పాటు జైలు శిక్ష, 20వేల దిర్హామ్స్( సుమారు రూ.3.92లక్షలు) జరిమానా చెల్లించాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరినైనా తిడుతూ అభ్యంతరకరమైన సందేశాలు పంపించడం చేస్తే అది అక్కడ సైబర్ క్రైమ్ కింద నేరం. సరదాగా అన్న మాటకు అతడు సుమారు రూ.మూడున్నర లక్షల మేర జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇలా సందేశం పంపించిన వ్యక్తికి భారీగా జరిమానా విధించడం అక్కడ ఇదేమి తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో నివసించే బ్రిటిష్ సిటిజన్ ఒకరు తన కార్ డీలర్‌ను తిడుతూ సందేశం పంపించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







