అమెజాన్ ఆపిల్ సేల్.. భారీ డిస్కౌంట్లు..

- December 12, 2018 , by Maagulf
అమెజాన్ ఆపిల్ సేల్.. భారీ డిస్కౌంట్లు..

అమెజాన్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ సేల్ డిసెంబరు 8న ప్రారంభమైన ఈ పండుగ 14న ముగియనుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ వంటి ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ వినియోగదారులకు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్‌లో రూ.16వేల వరకు తగ్గింపును అందిస్తోంది. కొన్ని ఆఫర్ల ధరలు
ఐఫోన్ ఎక్స్ 3జీబీ ర్యామ్ 64 జీబీ వేరియంట్ రూ.74,999 లకే లభ్యం, ఎంఆర్‌పీ ధర రూ.91,900.
256జీబీ వేరియంట్ రూ.89,999కు లభిస్తుంది. అసలు ధర రూ.1,06,900.
ఐఫోన్ 8 64 జీబీ వేరియంట్ ఈ సేల్‌లో రూ.54,999కే లభ్యం. అసలు ధర రూ.67,940.
ఐఫోన్ 8 ప్లస్: 64 జీబీ వేరియంట్ ఈ ఫెస్ట్‌లో రూ.64,999. అసలు ధర రూ.77,560
ఐఫోన్ 7 32జీబీ అసలు రూ.39,900 అమెజాన్ సేల్‌లో రూ.36,999లకు అందుబాటులో ఉంది.
ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల 8 జనరేషన్ రూ.1,05,900లకే లభ్యం. అసలు ధర రూ.1,14,900.ఆపిల్ ఎయిర్ పాడ్స్ ఈ ఫెస్ట్‌లో వీటి ధర రూ.12,900 నుంచి 11,999 కు తగ్గింది.
వీటితో పాటు మరిన్ని ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com