కేసీఆర్ అనే నేను..
- December 13, 2018
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయ నగారా మోగించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.25 గంటలకు కెసిఆర్‌తో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపొందడంతో కెసిఆర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ప్రస్తుత గవర్నర్ నరసింహనే. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కెసిఆర్‌తో పాటు ఒకరు లేదా ఇద్దరు ఎంఎల్ఎలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు పేరు వినిపిస్తోంది. ఎస్సి లేదా మైనార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి సిఎంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించనుందనే వార్తలు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







