వివాదాస్పదం : గూగుల్‌లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే..
- December 13, 2018
గూగుల్‌లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే ఎవరి ఫోటోలు దర్శనమిస్తాయో తెలుసా? ఎవరివో కాదు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోటోనే. నెటిజన్లు ఇడియట్ అని సెర్చ్ చేస్తే గూగుల్‌లో ట్రంప్ ఫోటో దర్శనమివ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత జులై నెల నుంచి ఈ పదం సెర్చ్ చేస్తే అమెరికా అధ్యక్షుడి చిత్రాలే కనిపిస్తున్నాయి.
అయితే.. ట్రంప్ పాలనపై అసంతృప్తితో ఉన్న వ్యతిరేకులు, ఆందోళనకారుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఫొటోకు ఇడియట్ అని జతచేసి గూగుల్ ఆల్గరిథమ్కు లింక్ చేయడంతో ట్రంప్ ఫొటోలు కనబడుతున్నాయని టెక్నాలిజీ నిపుణులు అంటున్నారు. ఇదే అమెరికా మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేకమంది గూగుల్ ఆల్గరిథమ్కు ట్రంప్ ఫొటోను ఇడియట్ పదంతో లింక్ చేయడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు.
అయితే అమెరికా జ్యూడిషియరీ కమిటీ సమావేశంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కమిటీ సమావేశానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హాజరయ్యారు. ఇడియట్ అని సెర్చ్ చేస్తే ట్రంప్ ఫొటోలు ఎందుకు కనిపిస్తున్నాయి? అసలు గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తోందో చెప్పాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించారు. గోప్యత, వ్యక్తిగత సమాచార సేకరణ వంటి అంశాల మీద జరిగిన కాంగ్రెస్ సభ్యుల జ్యుడీషియరీ కమిటీ సమావేశంలో ఈ డెమోక్రటిక్ సభ్యురాలు ఈ విషయాన్ని లేవనెత్తారు.
కోట్లాది వెబ్ పేజీలలోని సమాచారం గూగుల్ ఇండెక్స్‌లో కాపీ చేసి ఉంటుందని… ఎవరైనా ఏదైనా కీ వర్డ్‌తో గూగుల్‌లో వెతికినప్పుడు దాదాపు 200కు పైగా పోలికల ఆధారంగా సంబంధిత సమాచారం వస్తాయని సుందర్ పిచాయ్ తెలిపారు. అంతేకానీ తెరవెనుక ఎవరో ఉండి కావాలని చేసేది కాదంటూ వివరణ ఇచ్చారు.
జ్యూడిషియరీ కమిటీ సమావేశానికి హాజరైన పిచాయ్‌కి…..రాజకీయ పక్షపాతం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుతోంది? ముఖ్యంగా జీపీఎస్ ద్వారా వినియోగదారుల స్థానాన్ని ఎలా ట్రాక్ చేస్తోంది? అన్నది చెప్పాలని కమిటీ సభ్యులు అడిగారు. అన్నింటికి స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు సుందర్ పిచాయ్.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







