రెడ్ బస్ టీమ్‌పై ప్రయాణీకుల అసహనం
- December 13, 2018
బహ్రెయిన్: కింగ్‌డమ్‌లో ఇటీవల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని బలోపేతం చేసేందుకోసం రెడ్ బస్‌లను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే, ప్రయాణీకులు ఈ సిస్టమ్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'బిలో యావరేజ్' మార్కులు మాత్రమే ఈ సిస్టమ్‌కి ఇస్తున్నారు ప్రయాణీకులు. పంక్చువాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రెడ్ బస్ వినియోగదారుల్లో ఎక్కువమంది తక్కువ ఆదాయం గల కార్మికులే. ఈ కారణంతో ఎక్కడ తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలో వారికి తెలియడంలేదు. పంక్చువాలిటీ లేకపోవడం రెడ్ బస్ సిస్టమ్ ప్రధాన లోపమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సమాచారం అందుకునే వీలున్నా, అది కూడా సరిగ్గా పని చేయడంలేదనీ, ఈ కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్లు ట్రిప్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







