చక్కెర వ్యాధి నియంత్రణకు చిన్నచిన్న చిట్కాలు

- December 14, 2018 , by Maagulf
చక్కెర వ్యాధి నియంత్రణకు చిన్నచిన్న చిట్కాలు

మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం పాటూ మందులు వాడాల్సిందే. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలను పాటించటం వలన వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. అదనంగా, కార్బోహైడ్రేట్లను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే చాలా మంచిది.

1. మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో వ్యాయామాలు ముఖ్యమనే చెప్పాలి. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది.

2. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధిని నియంత్రించడమే కాకుండా పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన ఇన్సులిన్‌కు శరీరం మరింత సున్నితంగా మారుతుంది.
4. మాత్రలు శరీర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు రోజువారి ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా టైప్-1 మధుమేహాన్ని శక్తివంతంగా తగ్గుతుంది. కొన్ని సార్లు టైప్-2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుటకు ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది. క్రమంగా వైద్యుడిని కలిసి రక్తలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేయించుకోవటంతో పాటు, బ్లడ్ గ్లూకోస్ మీటర్‌తో తరచూ స్వతహాగా ఇంట్లో కూడా చెక్ చేస్తూ ఉండటం మంచిది. ఇలా క్రమంగా చెక్ చేస్తూ ఉండటం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గినా లేదా పెరిగిన వాటినికి అనుగుణంగా వైద్యం అందించవచ్చు.
5. కాకరకాయను కూరగా కానీ లేదా రసం రూపంలో తీసుకోవటం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు కలిగిస్తుంది.

6. పచ్చని ఆకుకూరలు తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటితో పాటుగా మధుమేహం కూడా తగ్గించబడుతుందని కొన్ని పరిశోధనలలో వెల్లడయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com