న్యూ ఇయర్‌ సేల్‌: ఇండియాకి తక్కువ ధరల్లోనే విమానయానం

- December 14, 2018 , by Maagulf
న్యూ ఇయర్‌ సేల్‌: ఇండియాకి తక్కువ ధరల్లోనే విమానయానం

ఇండిగో, జెట్‌ ఎయిర్‌ వేస్‌, ఫ్లై దుబాయ్‌ తమ న్యూ ఇయర్‌ సేల్స్‌ని ప్రకటించాయి. ఇండిగో సంస్థ నాలుగు రోజుల న్యూ ఇయర్‌ సేల్‌ని ప్రకటించింది. మొత్తం 90 రూట్లలో ఈ సేల్‌ వర్తిస్తుంది. 3,399 రూపాయల (175 దిర్హామ్‌లు) నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 12 నుంచి 16 వరకు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులు డిసెంబర& 27 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఈ ఆఫర్‌ టిక్కెట్లతో ప్రయాణించవచ్చు. నాన్‌ స్టాప్‌ విమానాలకే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. జెట్‌ ఎయిర్‌ వేస్‌, 30 శాతం డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. ఫ్లై దుబాయ్‌, 10 శాతం డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 మధ్య బుక్‌ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి మార్చి 31 వరకు ఆఫర్‌ టిక్కెట్లపై ప్రయాణించే వీలు కల్పిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com