రికార్డు స్థాయిలో డ్రగ్స్‌ పట్టివేత

- December 14, 2018 , by Maagulf
రికార్డు స్థాయిలో డ్రగ్స్‌ పట్టివేత

బహ్రెయిన్:కంబైన్డ్‌ మెరైన్‌ ఫోర్సెస్‌ నిర్వహణలో వున్న హెచ్‌ఎంఎస్‌ డ్రాగన్‌, మరో భారీ డ్రగ్స్‌ సీజర్‌ని చేపట్టింది. టైప్‌ 45 డిస్ట్రాయర్‌ అయిన హెచ్‌ఎంఎస్‌ డ్రాగన్‌, అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న భారీ మొత్తంలోని డ్రగ్స్‌ని పట్టుకోవడం జరిగింది. 500 కిలోల డ్రగ్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 200 కిలోల హెరాయిన్‌, 9 కిలోల క్రిస్టల్‌ మెథాంఫిటమైన్‌ కూడా వున్నాయి. వీటి ధర స్థానికంగా 2.1 మిలియన్‌ డాలర్లు వుంటుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటికే సిటిఎఫ్‌ 150, 49,255 కిలోల డ్రగ్స్‌ని ధ్వంసం చేయడం జరిగింది. కంబైన్డ్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిటిఎఫ్‌ 150లో భాగంగా టైప్‌ 45 డిస్ట్రాయర్‌ పెట్రోలింగ్‌ విధుల్ని నిర్వహిస్తోంది. కమాండర్‌ డారెన్ర్‌ గార్నియర్‌ ఆర్‌సిఎన్‌ నేతృత్వంలో రాయల్‌ కెనడియన్‌ నేవీ కమాండ్‌లో సిటిఎఫ్‌ బాధ్యతలు కొనసాగిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com