నేపాల్: ఘోర రోడ్డు ప్రమాదం...20 మంది మృతి
- December 15, 2018
ఖాట్మండ్ : నేపాల్‌లోని నువాకోట్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 20మంది మృతిచెందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నువాకోట్‌లోని కిమ్తాంగ్ నుంచి సిసిఫు వెళ్తున్న ఓ ట్రక్కు సముంద్రతర్ వద్ద అదుపుతప్పి కొండపై నుంచి నదిలో పడింది. ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారని, వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందినట్లు తెలిపారు. ఘటన సమయంలో ట్రక్కులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, భద్రతాసిబ్బంది, నేపాల్ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా తమ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బస్సు పరిమితి కంటే ఎక్కువ మంది ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







