‘యాత్ర’ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే..
- December 15, 2018
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం అయిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదట అనుకుంటున్నట్టు పండక్కి రావడం లేదు. 2019 ఫిబ్రవరి 8న విడుదల అవుతుందని నిర్మాతలు వెల్లడించారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు చెబుతున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ‘యాత్ర’ను నిర్మిస్తున్నారు. ఆనందో బ్రహ్మా చిత్రానికి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







