కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రముఖులు

- December 16, 2018 , by Maagulf
కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రముఖులు

డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ ఇవాళ జరగనుంది. చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాదురై విగ్రహంతోపాటు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలందాయి. ఇక.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ను కూడా ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com