వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లు

- December 16, 2018 , by Maagulf
వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లు

వాట్సాప్ అక్టోబర్ లో తన ఆండ్రాయిడ్ బీటా యాప్ కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ (పీఐపీ) మోడ్ విడుదల చేసింది. ఈ ఫీచర్ తో వాట్సాప్ యూజర్లు చాట్ విండోలోనే వీడియో ప్లే చేయవచ్చు. అంటే మీరు వాట్సాప్ లో ఎవరితోనైనా మాట్లాడుతూ వీడియో చూడాలనుకుంటే మీరు చాట్ విండో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సహా అన్ని యాప్స్ ని సపోర్ట్ చేస్తుంది.

ఎన్నో నెలల టెస్టింగ్ తర్వాత ఫేస్ బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ చివరకు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ విడుదల చేసింది. వాట్సాప్ తన అప్ డేట్ ని ప్లే స్టోర్ ద్వారా రోల్ ఔట్ చేస్తోంది. అంటే యూజర్లు ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ ని మాన్యువల్ గా అప్ డేట్ చేసుకోవాలి. కొత్త పీఐపీ మోడ్ వాట్సాప్ వర్షన్ 2.18.280పై లభిస్తోంది.

యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లు జోడిస్తూ వస్తోంది. ఇటీవలే కంపెనీ ఐఫోన్ యాప్ లో కొత్త గ్రూప్ కాలింగ్ బటన్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ యాప్ కి కూడా త్వరలోనే ఈ బటన్ రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ కోసం ముందు ఒక యూజర్ కి కాల్ చేసి తర్వాత మరొకరిని కలుపుకొనేవాళ్లు. కానీ కొత్త బటన్ వచ్చిన తర్వాత కాల్ ప్రారంభిస్తూన్ గ్రూప్ కాల్ లో పార్టిసిపెంట్స్ ను కలుపుకోవచ్చు.

త్వరలోనే వాట్సాప్ లో డార్క్ మోడీ ఫీచర్ కూడా రానున్నట్టు తెలిసింది. డార్క్ మోడ్ వస్తే యాప్ లో టెక్స్ స్పష్టంగా కనిపించడమే కాకుండా స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా మెరుగవడంలో సాయపడుతుంది. ఇటీవలే వాట్సాప్ 'స్వైప్ టు రిప్లై' ఫీచర్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఏదైనా మెసేజ్ ని స్వైప్ చేసి దానిని కోట్ చేస్తూ రిప్లయ్ ఇవ్వవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com