ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో.. విస్తుపోయే నిజాలు
- December 16, 2018
కర్ణాటకలో విషం కలిపిన ప్రసాదం తిని 12మంది భక్తులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘనటలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే ఈ ఘోరానికి కారణమని తేలింది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబ పెద్దనే ప్రసాదంలో విషం కలిసేలా చేసినట్టు సమాచారం.
ఆలయ ట్రస్ట్ అధినేత నేత చిన్నప్పి గురస్వామి అనే వ్యక్తితో గోపురం కోసం శంకుస్థాపన చేయించారు. దీనిని గురస్వామికి వరసకి తమ్ముడయ్యే దేవాంతి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆలయంపై ఆయన పెత్తనాన్ని అంగీకరించని ఆయన మహాదేశ్ అనే వ్యక్తితో కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విషం కలిపిన ప్రసాదం తిని ఇప్పటికే 12మంది మృతి చెందగా.. 40మంది అస్వస్థతకు గురై మైసూరు ఆసుపత్రిలో చేరారు. ప్రసాదం తిని ఆలయ పరిసరాల్లో 60కాకులు కూడా చనిపోవడం గమనార్హం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం కుమారస్వామి పరామర్శించారు. మృతులకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







