మలయాళీ నటి లీనాపై కాల్పులు..
- December 16, 2018
దక్షిణాది నటి లీనా మరియా పాల్ పై గుర్తు తెలీయని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లీనా పాల్ తో సహా ఎవరికీ గాయాలు కాలేదు.. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన లీనా బాలీవుడ్ లో మద్రాస్ కేప్, తమిళంలో బిరియాని, మలయాళంలో రెడ్ చిల్లీస్ తదితర మూవీల్లో నటించింది.. ప్రస్తుతం ఆమె కోచ్చిలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటోంది. బ్యూటీ పార్లర్ లో లీనా పాల్ ఉన్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు లీనా బ్యూటీ పార్లర్ పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.. అయితే లీనా పాల్ బ్యూటీ పార్లర్ అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు..కాగా లీనాపై ఇప్పటికే పలు కేసులు నడుస్తున్నాయి.. ముఖ్యంగా తమిళనాడు నేత టి టి డి దినకరన్ ఎన్నికల కమిషన్ ను మేనేజ్ చేసే క్రమంలో డబ్బు పంఫిణీ లీనా చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై కొచ్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







