శ్రీలంక రాజకీయ సంక్షోభానికి తెరపడింది
- December 16, 2018
శ్రీలంక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాణిల్ విక్రమసింఘె శ్రీలంక ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. నెలన్నర కిందట ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే... విక్రమసింఘెతో ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్‌లో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేశారు. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘెకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న రాజకీయ సంక్షోభం మొదలైంది. ప్రధానిగా ఉన్న విక్రమసింఘెను తొలగించి రాజపక్సను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్స నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







