వ్యాక్సిన్లు తయారు చేయనున్న కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- December 17, 2018

జెడ్డా: కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎయుఎస్‌టి), సౌదీ సెంటర్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ డెవలపింగ్ మెడికల్ వ్యాక్సిన్ ప్రొటీన్స్‌ని ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్‌లో ఈ తరహా తొలి ప్రాజెక్ట్ ఇదే. రీసెర్చ్ ప్రోడక్ట్స్ డెవలప్‌మెంట్ కంపెనీ మరియు సౌదీ వ్యాక్స్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో వ్యాక్సిన్స్‌ని తయారు చేస్తారు. కింగ్‌డమ్‌లో కరోనా వైరస్ వంటి వ్యాధులకు ఈ వ్యాక్సిన్లతో మరింత మెరుగ్గా చికిత్స అందించడానికి వీలవుతుందని అధికారులు అంటున్నారు. కెఎయుఎస్‌టి రీసెర్చ్ కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెఎయుఎస్‌టి స్టార్టప్స్, స్టార్టప్ ఇస్తాంబుల్ 2018 ఇంటర్నేషనల్ కాంపిటీషన్ టాప్ టెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఐరిస్, ఓయాసిస్, యూనిట్ ఎక్స్ టాప్ 100 స్టార్టప్స్‌లో చోటు దక్కించుకున్నాయి. యూనివర్సిటీ, ఎమర్జింగ్ కంపెనీస్‌కి సపోర్ట్‌నిస్తూ ప్రోత్సాహకాల్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







