మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరీ
- December 17, 2018
బ్యాంకాక్ : ఈ ఏడాది విశ్వ సుందరిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన క్యాట్రియోనో ఎలైసా గ్రే ఎంపికైంది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయ నిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన టామేరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా మిస్ వెనిజులా స్తేఫనీ గుత్రేజ్ నిలిచింది. మొత్తం 94 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన నెహల్ చుడాసమ టాప్ 20 లో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది.
ఇక మిస్ యునివర్స్ 2017గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరీ డెమి లీ తన చేతుల మీదుగా కిరిటాన్ని క్యాట్రియానోకు తొడిగింది. ఫైన్‌ల్ క్వశ్చన్ రౌండలో క్యాట్రియానోకు 'జీవితంలో నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన గుణపాఠం ఏమిటి? మిస్ యూనివర్సీగా దాన్నేలా చూస్తావు?' అనే ప్రశ్నఎదురైంది. దానికి ఆమె 'మనిలాలోని అనేక మురికివాడల్లో నేను పనిచేశాను. అక్కడి వారు చాలా పేదవారు. అందాన్ని చిన్నపిల్లల ముఖంలోని చూడాలని నాకు నేను చెప్పుకుంటాను.
మిస్‌యూనివర్సీగా వారికి నావంతుగా ఎదైనా సాయం చేస్తాను. వారికి మంచి చెడులను బోధించడం కూడా నాకు గొప్పవిషయమే. అలా చిన్నపిల్లల ముఖాల్లో చిరు నవ్వును చూడటమే నాకుక కావాలి' అని సమాధానం ఇచ్చింది. కళల పట్ల అత్యంత ప్రేమ కనబర్చే క్యాట్రియానో మ్యూజిక్ థియరీలో మాస్టర్ సర్టిఫికేట్ పొందింది.
పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ మానవతావాదిగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. తొలి రన్నరప్‌గా నిలిచిన టామేరిన్ గ్రీన్ వైద్య విద్యార్థి కాగా.. సెకండ్ రన్నరప్ స్తేఫనీ న్యాయవిద్యార్థి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్