అందానికి తగ్గ గొప్ప మనసుందని నిరూపించిన మిస్ యూనివర్స్ 2018
- December 17, 2018
2018 సంవత్సరానికిగాను విశ్వసుందరిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన భామ ఎన్నికైంది. మొత్తం 94 మంది పోటీపడగా క్యాట్రియోనో ఎలైసా గ్రే ఫైనల్ పోటీల్లో నిలిచి విజేతగా ఎంపికైంది. ఫిలిప్పిన్స్ నుంచి విశ్వసుందరిగా ఎన్నికైన నాలుగో అమ్మాయి ఎలైసా కావడం గమనార్హం.
ఈ పోటీల్లో ఎలైసాకు ఒక్క అందమే కాదు.. తెలివి తేటలు కూడా అలంకారప్రాయమయ్యాయి. ఫైనల్స్‌లో జడ్జీలు అడిగిన ప్రశ్న, చెప్పిన సమాధానం కూడా పస్ల్ అయ్యింది. "జీవితంలో నేర్చుకున్నగుణపాఠం ఏంటీ?, మిస్ యూనివర్స్‌గా ఆ సమస్యను ఎలా చూస్తారు? అనే ప్రశ్నను జడ్జిలు సంధించారు. దీనికి ఎలైసా గ్రే స్పష్టంగా సమాధానం చెప్పి జడ్జిల మనసులను గెలుచుకుంది.
"మనీలాలోని మురికివాడల్లోని చిన్నారులను చూసినప్పుడు ఎంతో బాధేసింది. వారి ముఖాల్లో చిరునవ్వును, అందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ చిన్నారుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తా. వారికి మంచి, చెడులు, విద్య అందిస్తా" అని చెప్పారు. ఈ సమాధానానికి ఫిదా అయిన జడ్జీలు ఆమెకు విజేతగా ప్రకటించారు.
కాగా, ఎలైసా గ్రే ఒక సాధారణమైన యువతి కాదు. మ్యూజిక్ థీయరీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ రన్నరప్‌గా సౌతాఫ్రికాకి చెందిన టామేరిన్ గ్రీన్ సెలక్ట్ అయ్యింది. సెకండ్ రన్నరప్‌గా వెనిజులా బ్యూటీ స్తేఫనీ నిలిచింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







