దక్షిణ సౌదీలోని జజాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
- December 23, 2015
సౌదీ అరేబియాలో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 25మంది దుర్మరణం చెందగా, మరో 100మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సౌదీలోని జజాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదం 25మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ లో ముందుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఆ మంటలు మెటర్నటీ వార్డుకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై మీడియా ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా వివరాల కోసం అధికారులను సంప్రదించగా... ' ఆస్పత్రి ప్రమాద ఘటన ఇంతటితో ముగిసిపోయిందని, విచారణ జరుగుతోందని, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని' తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









