తెలంగాణకు కేంద్రం శుభవార్త..
- December 18, 2018
ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఏళ్లనాటి కల నెరవేరింది. తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. సుమారు 1028 కోట్ల రూపాయల ఖర్చుతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఏయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 1264 కోట్లతో తమిళనాడు మధురైలోనూ ఏయిమ్స్ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
అవంతరాలు, అభ్యంతరాలు.. అన్నింటిని మించి అలుపెరగని తెలంగాణ సర్కార్ పోరాటం ఫలించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లో ఏయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
బీబీ నగర్ ఎయిమ్స్ వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1500 ఓపీ, వెయ్యి మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందించనున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు 1264 కోట్లతో తమిళనాడులోని మధురైలో కూడా ఏయిమ్స్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య కళాశాలలు సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







