ఎన్టీఆర్ న్యూ లుక్!
- December 18, 2018
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలకు ఎంతో ప్రత్యేకం ఉంటుంది. ఆయన ఏ సినిమా తీసినా హీరోయిజాన్ని చాలా వెరైటీగా చూపిస్తుంటారు. అంతే కాదు హీరోలను కూడా చాలా ప్రత్యేకంగా చూపిస్తుంటారు. ఒకప్పుడు లావుగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ని 'యమదొంగ'సినిమాతో కరెంట్ తీగలా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ని కండలు తిరిగిన ఆజానుభాహుడిగా చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ గా 'ఆర్ ఆర్ ఆర్'ప్రాజెక్ట్ బిజిలో ఉన్నారు దర్శకధీరుడు రాజమౌళి. మూవీ ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జనవరి నుండి మరో షెడ్యూల్ జరుపుకోనుంది.
రామ్ చరణ్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మద్య సినిమా షూటింగ్స్ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు పలానా సినిమాలో తమ హీరో ఎలా ఉంటాడో అన్న విషయం ముందుగానే తెలిసిపోవడంతో అభిమానుల్లో నిరుత్సాహం పెరిగిపోతుంది. ఆ కారణంతోనే ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి ఎన్నో కట్టుదిట్టాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతటి వారైనా షూటింగ్ స్పాట్ కి సెల్ ఫోన్స్ తీసుకు రావొద్దని ముందే హచ్చరించారు.
అంతే కాదు ఎలాంటి మైక్రో కెమెరాలు పనిచేయకుండా జామర్లు కూడా వాడుతున్నట్లు సమాచారం. ఆ మద్య ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. దీనిపై ఎన్టీఆర్ ట్రైనర్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ తన భార్య, ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆర్ఆర్ఆర్‌లో యంగ్‌టైగర్ లుక్ ఇదేనంటూ నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేస్తూ.. మూవీని ట్రెండింగ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







