వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆయన తనయుడు ఘనంగా నివాళులర్పించారు

- December 23, 2015 , by Maagulf
వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆయన తనయుడు ఘనంగా నివాళులర్పించారు

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆయన తనయుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం ఆయన పార్టీ నేతలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకున్నారు. మహానేత సమాధిపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సంబటూరి ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన వేముల మండలం కొన్‌రెడ్డిపల్లెకు వెళ్లారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తారు. అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల, అనిల్‌కుమార్ దంపతుల కుమారుడు, కుమార్తె మహానేత సమాధి వద్ద నివాళులర్పించారు. నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్...తొలి రోజు పర్యటన (డిసెంబర్ 24, 2015) ► డిసెంబర్ 24 న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులుఆర్పిస్తారు. ► ఉదయం 9 గంటలకు ప్రార్థన సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ► మధ్యాహ్నం 12.30 లకు ప్రొద్దుటూర్ లోని ఎఫ్ జీ ఫంక్షన్ హాల్ లో పులివెందుల కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. ► మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూర్ లో కొవ్వూరు రామసుబ్బారెడ్డి కల్యాణమండపంలో జరిగే వినోద్ కుమార్ రెడ్డి మ్యారెజ్ రిసెప్షన్ కు హాజరవుతారు. ► సాయంత్రం 4 గంటలకు కొండారెడ్డిపల్లికి చేరుకుని అక్కడి సర్పంచ్ శివ ప్రసాద్ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డిని వైఎస్ జగన్ అశ్వీరదీస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com