`కొత్తగా మా ప్రయాణం` ట్రైలర్ విడుదల
- December 18, 2018
ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ `కొత్తగా మా ప్రయాణం`. యామిని భాస్కర్ కథానాయిక. `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి, నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవలే రిలీజైన టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్, వినోదంతో ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఆడియో త్వరలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రమణ మాట్లాడుతూ-"ఇటీవలే రిలీజైన టీజర్ కి జనం నుంచి చక్కని స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేశాం. దీనికి అద్భుత స్పందన వస్తోంది. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తవుతున్నాయి. నవతరం సినిమాల్లో యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పటికే క్రేజు వచ్చింది. కథాంశం అందుకు తగ్గట్టే ప్రామిస్సింగ్‌గా .. ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే పరంగానూ కొత్తగా ఉండే చిత్రమిది. పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమకథలో ట్విస్టులేంటో తెరపైనే చూడాలి. అందరికీ సాయపడే తత్వం ఉన్నా హీరోకి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సాంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. నెలకు 2లక్షల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి కథ ఇది. ప్రియాంత్ కి తొలి సినిమానే అయినా తడబడకుండా చక్కగా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆ ఇద్దరికీ పేరొస్తుంది. యువతరాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.
భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, కరుణాకర్, సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







