పెరుగుతున్న మధుమేహులు

- December 23, 2015 , by Maagulf
పెరుగుతున్న మధుమేహులు

డయాబెటిస్‌ (మధుమేహం)పై మరింత అవగాహన కల్పించవలసి ఉందని సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ అభిప్రాయపడింది. 40 ఏళ్ళలోపు వారూ ఎక్కువగా మధుమేహం బారిన పడ్తుండడం ఆందోళన కల్గించే విషయమని పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెప్పారు. ఫిట్‌నెస్‌ అండ్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ 14వ ఎడిషన్‌లో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఖాజా యూసుఫ్‌ అలీ మాట్లాడుతూ, చాలామంది తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనీ, చాలామందికి తాము డయాబెటిస్‌తో బాధపడ్తున్నామన్న విషయం కూడా తెలియదని అన్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, తగ్గుతున్న ఫిజికల్‌ యాక్టివిటీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో సోడియం ఎక్కువగా ఉండటం వంటివన్నీ మధుమేహానికి కారణమని చెప్పారాయన. 30 ఏళ్ళలోపు యువతీ యువకులు హైపర్‌టెన్షన్‌ (బీపీ), డయాబెటిస్‌ (షుగర్‌) వ్యాధులతో బాధపడ్తుండడం ఆందోళనకరమని అన్నారు. ఖతార్‌లో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడ్తున్నామనీ, మెడికల్‌ చెకప్‌ క్యాంప్స్‌ ఇంకా విస్తృతంగా జరగాల్సి ఉందని చెప్పారాయన. ఎస్పైర్‌ పార్క్‌ వద్ద 4 గంటల నుంచి 7 గంటల వరకు పఫిట్‌నెస్‌ అండ్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించబడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com