రైతుల రుణమాఫీని ప్రకటించిన రాజస్థాన్ సీఎం
- December 20, 2018
రాజస్థాన్లో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలను వచ్చీ రాగానే నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా బుధవారమే బాధ్యతలు స్వీకరించిన అశోక్ గెహ్లట్ రూ. 2 లక్షల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోమవారమే రైతు రుణమాఫీని ప్రకటించగా, బుధవారం అశోక్ గెహ్లట్ ప్రకటించారు. రాజస్థాన్లో రుణమాఫీ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 18 వేల కోట్ల భారం పడనుంది.
ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోపే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించి హామీని నిలబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..