వరుస దొంగతనాలతో అమ్వాజ్ రెసిడెంట్స్ ఆందోళన
- December 20, 2018
అమ్వాజ్ ఐలాండ్స్‌లో వరుస దొంగతనాలు రెసిడెంట్స్‌ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో 300 బహ్రెయినీ దినార్స్ దొంగిలించారు దొంగలు. ఓ వలసదారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఏదో శబ్దం అవుతోందని గుర్తించిన బాధితుడు, లేచి చూసే సరికి.. దొంగ పారిపోతున్నట్లు గుర్తించడం జరిగింది. కంగారులో దొంగ, తన పర్సులోని డబ్బు తీసుకుని పారిపోయాడనీ, అదృష్టవశాత్తూ ఆ పర్స్‌ని దొంగ పారేయడంతో తాను ఊపిరి పీల్చుకున్నాననీ, అందులో విలువైన డాక్యుమెంట్స్ వున్నాయని బాధఙతుడు చెప్పారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఓ మహిళ తన ఇంట్లోంచి 600 బహ్రెయినీ దినార్స్‌ని దొంగలు దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. కాగా, ముహరాక్ పరిధిలో నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







