స్టేడియంలలో కొన్ని వస్తువులపై యూఏఈ బ్యాన్
- December 20, 2018
క్రికెట్ కావొచ్చు, మరో ఆట కావొచ్చు.. మైదానంలో ఆటగాళ్ళు గెలుపు కోసం పోరాడుతోంటే, మైదానం వెలుపల ఆ గేమ్‌ని చూసేందుకు ఔత్సాహికుల్లో ఉత్సాహం ఓ రేంజ్‌లో కన్పిస్తుంది. ఆహ్లాదకర వాతావరణం, ప్రమాదభరితంగా మారకుండా వుండేందుకోసం కొన్ని రకాలైన వస్తువుల్ని స్టేడియంలలోకి అనుమతివ్వకుండా అబుదాబీ పోలీస్ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో లేజర్ పెన్స్, పెట్స్, బ్రాస్ నకుల్స్, మెడిసిన్స్, అంబ్రెల్లాస్, నైవ్స్, సిగరెట్స్, గన్స్ వంటి వాటిని స్టేడియంలలో నిషేధించారు. మంగళవారం జరిగిన రివర్ ప్లేట్ వర్సెస్ అల్ అయిన్ సెమీ ఫైనల్ - ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా అర్జెంటినా అభిమానులు హద్దులు మీరిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. హజ్జా బిన్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







