దోహా లో మజ్లీస్ & తెరాస విజయోత్సవ వేడుకలు
- December 20, 2018
దోహా:మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తెరాస మరియు మజ్లీస్ పార్టీల ఎన్నారై నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి దోహలో బావార్చి హోటల్ లో సమావేశం అయి వారి అభిమాన పార్టీలు గెలుపొందిన సందర్బంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని వారి అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు సుమారు 200 మంది పాల్గొన్నారు. వేడుకల్లో .తెలంగాణ రాష్ట్ర సమితి ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని మరియు ఖతర్ మజ్లిస్ నాయకులు సిరాజ్ అన్సారీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శోభన్ బందారపు, కుమార్ ఖురేషీ, మహమ్మద్ సోహేల్,శంకర్ సుందరగిరి, ప్రమోద్ కెత్తే,సయ్యద్ అజహర్, శేఖర్ చిలువేరి శంకరాచారి బొప్పరపు , ఇబాదుర్ రెహమాన్, ఆబెద్, షర్ఫొద్దీన్, విష్ణు వర్ధన్ రెడ్డి, రాజేష్ నేత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ KCR గారి పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని KCR గారి ఆధ్వర్యంలో దేశంలో ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ ఏతర, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వ ఏర్పాటుకి పని చేస్తుంది అని దీనికి దేశం వ్యాప్తంగా మద్దతు ఉందని తెరాస & mim సభ్యులు ముక్త ఖటం తో ఫెడరల్ ఫ్రంట్ నినాదానికి పిలుపునిచ్చారు.
అలాగే ఈ వేడుకలకు విచ్చేసిన అభిమానులకు మంచి పసందైన బావార్చి(హైద్రాబాద్ స్పెషల్) బిర్యానీ తో విందు ఏర్పాటు చేశారు నాయకులందరూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా మజ్లీస్,తెరాస గెలుపుకు కృషి చేస్తామని ప్రతినభునారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







