'సైరా' లో తమన్నా.!

'సైరా' లో తమన్నా.!

చిరంజీవి- నయనతార- తమన్నా కాంబోలో రానున్న ఫిల్మ్ 'సైరా నరసింహారెడ్డి'. శుక్రవారం తమన్నా పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. లుక్‌లో తమన్నా యువరాణిలా అందంగా వుంది. ఆమె రోల్‌కి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్నాడు. నరసింహారెడ్డి వైఫ్ సిద్ధమ్మగా నయనతార కనిపిస్తుంది. అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, హుమాఖురేషి, నాజర్‌ వంటి నటులు మిగతాపాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని
తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి.

 

Back to Top