ప్రేమ కథా చిత్రమ్ 2 టీజర్ రిలీజ్
- December 21, 2018
హరర్ అండ్ లవ్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ప్రేమకథా చిత్రమ్. 2013 మే 11న విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా 'ప్రేమ కథా చిత్రం 2' సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ కథా చిత్రం2 రూపొందుతుందని నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు భయపెట్టేవిగా ఉన్నాయి. తొలి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మరింత భయపెట్టిస్తుందని అంటున్నారు. టీజర్‌లో లవ్ .. రొమాన్స్ ..హారర్ సన్నివేశాలు ఉన్నాయి. నందిత దెయ్యంగా కనిపిస్తూ అలరించింది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి పని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







