'గరమ్'.సినిమా పాటలను డిసెంబర్ 23న విడుదల చేశారు..
- December 24, 2015
ఊర్లో ఊరికే కాలం గడిపేసే ఏ కుర్రాడికైనా వాడ్ని చూసి నేర్చుకో.. వీడ్ని చూసి నేర్చుకో.. లాంటి మాటలు వినపడటం మామూలే. వరాలబాబుదీ అదే పరిస్థితి. అయితే ఈ కుర్రాడికి ఆ మాట నచ్చలేదు సరికదా 'నన్ను చూసి ఎవడైనా నేర్చుకునేలా మారి చూపిస్తా 'అని తండ్రితో శబదం చేసి మరీ సిటీకొచ్చాడు. కుర్రాడు కదా కాస్త దూకుడెక్కువ. ఆ దూకుడుతోనే వచ్చీ రాగానే చిలక లాంటి ఓ పాపని చూడటంతో మనోడిలో నరాల్లో కరెంట్ పాసయ్యి దిల్ 'గరమ్' అయ్యింది. అక్కడినుండి వరాలబ్బాయి కథ ఎటు మళ్ళింది అన్నది తెరమీదే చూడాలంటున్నారు ఆది. ఆయన హీరోగా మదన్ తెరకెక్కించ చిత్రం 'గరమ్'. ఆదాశర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించారు. ఆది పుట్టినరోజు సందర్భంగా నిన్న (డిసెంబర్ 23న) హైదరాబాద్‌లో గరమ్ సినిమా పాటలను విడుదల చేశారు. హీరో గోపీచంద్ ఆడియో విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, రానా, సందీప్ కిషన్, నిఖిల్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









