బ్రాడ్ బ్యాండ్ కమ్యునికేషన్ శాటిలైట్ సక్సెస్
- December 22, 2018
హోంగ్‌యున్ ప్రాజెక్ట్ లో భాగంగా చైనా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సామర్థ్యం ఉన్న కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతగా ప్రయోగించింది. ఈ శాటిలైట్ కు ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు.. భూమి మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ శాటిలైట్ ను నార్త్ వెస్ట్ చైనా లోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్-11 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది విజయవంతగా కక్ష్యలోకి ప్రవేశించింది. గూగుల్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ఇంటర్నెట్ సంస్థలకు.. ఈ శాటిలైట్ సరికొత్త సవాల్‌ను విసరనున్నది. ఈ శాటిలైట్‌తో ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం గత రెండేళ్లుగా హూంగ్‌యున్ ప్రాజెక్టుపై చైనా పనిచేస్తున్నది. ఉపగ్రహం బరువు 247 కిలోలు. ఇది భూమికి 1100 కిలోమీటర్ల ఎత్తులో భ్రమిస్తుంది. కనీసం ఏడాది పాటు పనిచేసే విధంగా దీన్ని రూపొందించారు. అయితే అధిక సంఖ్యలో హూంగ్‌యున్ ఉపగ్రహాలను తయారు చేసేందుకు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంస్థ పనిచేస్తున్నది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







