ముగిసిన కొచ్చి మెట్రో బహ్రెయిన్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2018

- December 22, 2018 , by Maagulf
ముగిసిన కొచ్చి మెట్రో బహ్రెయిన్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2018

ఫస్ట్‌ ఎడిషన్‌ కొచ్చి మెట్రో బహ్రెయిన్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2018 ముగిసింది. నికాన్‌ మిడిల్‌ ఈస్ట్‌ మరియు సినికో సహకారంతో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించారు. సౌతిండియన్‌ యాక్టర్‌ రవీంద్రన్‌ ఆలోచన మేరకు ఈ ఫెస్టివల్‌కి రూపకల్పన జరిగింది. క్యాపిటల్‌ గవర్నర్‌ షేక్‌ హిషామ్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ ఖలీఫా సమక్షంలో, డిప్యూటీ గవర్నర్‌ హస్సన్‌ అబ్దుల్లా అల్‌ మదానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినికో ఎక్స్‌, ఒయాసిస్‌ మాల్‌, జుఫైర్‌ స్క్రీన్స్‌ ఈ ఈవెంట్‌కి నెర్వ్‌ సెంటర్‌గా వ్యవహరించాయి. బహ్రెయినీ ఫిలిం మేకర్స్‌ మొహమ్మద్‌ బు అలి, ఘాదీర్‌ అలి, సౌదీ ఫిలిం మేకర్‌ ఫర్హాత్‌ మరియు బహ్రెయిన్‌ బేస్డ్‌ ఫిలిం మేకర్‌ రామ్‌ గోపాల్‌ మీనన్‌ రూపొందించిన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. అరబిక్‌, ఇండియన్‌ కల్చరల్‌ యాక్టివిటీస్‌ కూడా ఈ ఈవెంట్‌లో అలరించాయి. ఫోక్‌ డాన్స్‌, సంప్రదాయ మ్యూజికల్‌ మరియు డాన్స్‌ ఐటమ్స్‌, స్కిట్స్‌ని ప్రదర్శించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com