లైవ్ సూసైడ్‌కి యత్నించిన బాలిక
- December 22, 2018
యూ.ఏ.ఈ:సోషల్ మీడియాలో తనను కొందరు ట్రాల్ చేస్తుండడంతో తట్టుకోలేక 20 ఏళ్ళ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఆమెను రక్షించారు. బాధితురాల్ని భారతీయ బాలికగా గుర్తించారు. సోసల్ మీడియాలో, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో వుంచింది బాధితురాలు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తన ఆత్మహత్యను అందరికీ చూపించాలని ఆమె ప్రయత్నించింది. బాధితురాలు షార్జాలోని అల్ నహ్దా ప్రాంతానికి చెందిన వ్యక్తి. సమాచారం అందుకోగానే రంగంలోకి దిగిన పోలీసులు, బాధితురాలి లొకేషన్ని గుర్తించి, వెంటనే ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు. ఆమె ఆత్మహత్యకు యత్నిస్తోందన్న విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. పోలీసుల్ని చూసి, బాధితురాలు ఆవేశానికి లోను కాగా, పోలీసులు ఆమెను కూల్ చేశారు. తల్లిదండ్రులు, తమ పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







