ఎన్టీఆర్ పరువు తీస్తున్న లక్ష్మీపార్వతి.. – తెలుగు తమ్ముళ్లు
- December 23, 2018
వివాదాలకు కేరాఫ్ రాంగోపాల్ వర్మ.. మరోసారి తన స్టైల్లో పెను వివాదాన్ని రేపారు. ఏకంగా ఏపీ రాజకీయాల్లో చిచ్చు పెట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెన్నుపోటు పాటపై దుమారం రేగుతోంది. వెన్నుపోటు పాట.. ఏపీ సీఎం చంద్రబాబును కించపర్చే విధంగా ఉందంటూ తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మరోవైపు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది.
ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెన్నుపోటు పాటపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ.. పోలీసుల స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేస్తున్నారు.
రాంగోపాల్‌వర్మపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబుని కుట్రదారునిగా చిత్రీకరిస్తూ పాట విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో రాంగోపాల్‌వర్మ ఫ్లెక్సీలు, ఫోటోలను దగ్ధం చేశారు. రాజకీయ కారణాలతోనే వర్మ.. చంద్రబాబును టార్గెట్ చేశారంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఆడవాళ్లను కించపరిచేలా వ్యవహరించే వర్మకు.. లక్ష్మీపార్వతి మద్దతుగా నిలిచి ఎన్టీఆర్ పరువు తీస్తున్నారన్నారు. ముంబై, హైదరాబాద్‌లో దెబ్బలు తిన్నా వర్మకు బుద్ది రాలేదంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆదర్శవంతమైన ఘట్టాలున్నాయని.. వర్మ వాటిని ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
వర్మ పద్ధతి మార్చుకోకుంటే దాడులు కూడా వెనుకాడమంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. కేవలం తన సినిమాకు చిల్లర పబ్లిసిటీ రావడం కోసం చంద్రబాబు ఫుటోను వాడుకున్నారని.. ఇదంతా వైసీపీ నేతలే వెనకాతల ఉండి చేయిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతల ప్రోత్సాహంతో.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇమేజ్ను వర్మ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై వస్తున్న విమర్శలు, కేసులపైనా వర్మ అంతే స్థాయిలో స్పందించారు. ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ కాపీని ట్వీట్ చేస్తూ.. తాను కూడా అక్కడికి వెళ్తా.. ఫిర్యాదుపై ఫిర్యాదు చేస్తా.. అన్నారు. అంతకు ముందు టీడీపీ నేతలు కార్యకర్తల ఫిర్యాదులు, నిరసనలపై హర్షం వ్యక్తం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాళ్ల ఆందోళనలతో యూట్యూబ్‌లో తన వీడియోకి వ్యూస్ మరిన్ని పెరుగుతున్నాయంటూ సెటైర్ వేశారు.
వర్మకు వివాదాలు కొత్త కాదు. అయితే ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేయడానికి సమయం సిద్ధమైన సమయంలో దానికి విరుద్ధమైన సినిమాను రిలీజ్ చేసేందుకు వర్మ సిద్ధమయ్యారు. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించి పాటను రిలీజ్ చేస్తూ.. అందులో చంద్రబాబు ఫోటోలను వాడడం పెను వివాదం అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!