కాసేపట్లో విశాఖకు పయనమవ్వనున్న తెలంగాణ దొర
- December 23, 2018
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని ఆయన సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేసీఆర్..మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకుంటారు.
దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇక.. విశాఖ పర్యటన అనంతరం కేసీఆర్.. భువనేశ్వర్ వెళ్తారు.
కేసీఆర్ వ్యక్తిగత భద్రత ఏర్పాట్లను తెలంగాణ నుంచి వచ్చే బలగాలు చూసుకుంటాయని.. విశాఖ పోలీసులు బయటి భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







